రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు ఆపాలి

10-09-2026 | 04:56pm

కలెక్టరేట్ ఎదుట రైస్ మిల్లర్ల మహా ధర్నా

బకాయిల పేరిట రైస్ మిల్లర్లను వేధించవద్దు

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పప్పుల రాజేంద్రప్రసాద్

కామారెడ్డి,(విజయక్రాంతి): రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులను ఆపాలని కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్(Kamareddy District Rice Millers Association) అధ్యక్షులు పప్పుల రాజేంద్రప్రసాద్ కోరారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్(Kamareddy Collectorate) ఎదుట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. రైస్ మిల్ వ్యాపారులను ప్రభుత్వం వేదించవద్దని కోరారు. 2014 నుంచి ఇప్పటివరకు మిల్లింగ్ చార్జీలను రైస్ మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యం ఇచ్చిన ప్రభుత్వం మూడు నెలలకే బియ్యం తీసుకోవాలని అన్నారు. గోదాముల వద్ద లారీలను వారాల కొద్దీ నిల్ప వద్దు అని అన్నారు. రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు ఆపాలన్నారు. రైస్ మిల్ వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. పేరిగిన విద్యుత్ చార్జీల వల్ల తమకు  నష్టం వచ్చిందన్నారు. సిఎంఆర్ 

మీల్లింగ్ తో రైస్ మిల్లర్లకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. పెరిగిన విద్యుత్ చార్జీలు, కార్మికుల వేతనాలు, రవాణా చార్జీలు మరింత పెరిగిందన్నారు. దీంతో రైస్ మిల్లర్లు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వానికి బకాయి పడ్డ రైస్ మిల్లుల పై దాడులు నిర్వహించాలి కానీ, అన్ని రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు చేయడం తగదన్నారు. ఈ సమావేశంలో రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు కంచర్ల లింగం, మాజీ రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరీ శంకర్, డివిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు భూమేష్ గుప్త, జిల్లాలోని రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు