7 September, 2026 | 7:24 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎత్తేయొద్దు

07-09-2026 | 04:55am
  1. పాత విధానమే కొనసాగించాలి
  2. రూ 8 వేల బకాయిలు వెంటనే చెల్లించాలి
  3. 10న బీసీల రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం
  4. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, సెప్టెంబర్ 6(విజయక్రాం తి): ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fees reimbursement) పథకాన్ని ఎత్తే సే కుట్రలను ప్రభుత్వం వెంటనే మానుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం  అ ధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ ల సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల10న హైదరాబాద్‌లో బీసీ సంక్షేమ జాతీయ సంఘం (BC Welfare National Association) రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లు వెంటనే విడుదల చేసి పా త విధానాన్ని కొనసాగించాలని  డి మాండ్ చేశారు. 

ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తేసే ఆలోచనను ప్రభు త్వం మానుకోవాలన్నారు. ఫీజు బకాయిలను విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా వేస్తా మని చెప్ప డం బీసీ విద్యార్థుల గొంతు కోసే చర్య అని మండిపడ్డారు.

పథకాన్ని యధావిధిగా కొనసాగించాలన్నారు. ఫీజు బకా యిలు చెల్లించకపోతే దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లోనే ఉండిపోయే పరిస్థితి ఉందని, బకాయిలు విడుదల చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్ల అ ంజి, బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి. అనంతయ్య, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ నిఖిల్ పటేల్, బీసీ  సంఘం నాయకులు సి.రాజేందర్, చిక్కుడు బాలయ్య, ప్రీతం, భీమ్రాజ్  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు