calender_icon.png 6 December, 2024 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం

27-10-2024 01:03:13 AM

మృతిచెందిన కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు సీఎం రేవంత్‌రెడ్డి భరోసా

కొడంగల్, అక్టోబర్ 26: కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబానికి అండగా ఉంటామని సీఎం రేవంత్‌రెడ్డి భరో సా ఇచ్చారు. కొడంగల్ నియోజకవర్గం బొమ్మరాస్‌పేట మండలం రేగడి మైలారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నర్సిరెడ్డి ఇటీవల మృతిచెందగా, ఆయన కుటుంబాన్ని సీఎం రేవంత్‌రెడ్డి శనివారం పరామర్శించారు. నర్సిరెడ్డి మృతి బాధాకరమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట: మద్దూర్ మండ ల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కల్లపు సతీష్ ఇటీవల మర ణించగా, శనివారం దశదిన కర్మ నిర్వహించారు. కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరై సతీష్ కుటుంబసభ్యులను ఓదార్చారు.