డ్రైనేజీ పనులకు శ్రీకారం
ఆసిఫాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో డ్రైనేజీ పనులకు కౌన్సిలర్ రాపర్తి కార్తిక్ కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. కాలనీ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు (Basic Facilities) కల్పించేందుకు ఈ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
డ్రైనేజీ పనులను నాణ్యతా ప్రమాణాలతో (Quality Standards) వేగంగా పూర్తి చేసి.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని కౌన్సిలర్ పేర్కొన్నారు. పనులు ప్రారంభం కావడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ రమాదేవి, ఏఈ నవీన్, కాలనీ వాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.