సారపాకలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
10-09-2026 | 08:14pm
బూర్గంపాడు,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణకు బూర్గంపాడు పోలీసులు గురువారం సారపాకలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు(Drunk and drive checks) నిర్వహించారు. ఎస్సై మేడ ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాలను తనిఖీ చేసి, వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవాలని, అతివేగం, నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం మానుకోవాలని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. వారితోపాటు అదనపు ఎస్సైలు నాగ బిక్షం,రామ్మూర్తి,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.