రౌడీషీటర్లు, అనుమానితులకు డీఎస్పీ కౌన్సిలింగ్

16-09-2026 | 08:00pm

మణుగూరు,(విజయక్రాంతి): రౌడీషీటర్లు(rowdy sheeters), అనుమానితులకు మణుగూరు డీఎస్పీ రవీంద్ర రెడ్డి(Manuguru DSP Ravinder Reddy) కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎలాంటి అల్లర్లు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. చెడు నడవడికకు దూరంగా ఉండి సమాజంలో బాధ్యతాయుతంగా జీవించాలని సూచించారు. ఎటువంటి నేరాలకు పాల్పడకుండా చట్టాలను గౌరవించాలని స్పష్టం చేశారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని డీఎస్పీ కోరారు. నేరప్రవృత్తిని విడనాడి కుటుంబంతో ప్రశాంతంగా జీవించాలని సూచించారు. ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోలీసుల సూచనలను పాటిస్తూ చట్టబద్ధంగా వ్యవహరించాలని రవీంద్ర రెడ్డి పేర్కొన్నారు. ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో సీఐ నాగబాబు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు