ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పోరాటంలో డీటీఎఫ్ ముందంజ
08-09-2026 | 09:52am
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), సెప్టెంబర్ 7: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి డీటీఎఫ్(DTF) ముందుండి పోరాడుతుందని సంఘం రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య, జిల్లా అధ్యక్షుడు షేక్ ఉమర్(President Sheikh Umar) అన్నారు. సోమవారం జాజిరెడ్డిగూడెం మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిల సాధన కోసం సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో జరిగే సమస్యల సాధన సభకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. కేజీబీవీ, గురుకుల, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.