ఘనంగా శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం
01-10-2026 | 08:03pm
ఇల్లెందు,(విజయక్రాంతి): పట్టణంలోని 24 ఏరియా సెంటర్‌లో గురువారం శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు(Durga Devi Sharannavaratri Utsavalu) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభానికి ముందు పాలకర్ర నాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏరియా ఆడపడుచులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 24 ఏరియాలో గత ఏడాది ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు(Sharannavaratri Utsavalu) విజయవంతంగా కొనసాగుతున్నాయి. అదే స్ఫూర్తితో రెండో ఏడాది కూడా భక్తులు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పాల్గొని తొలిరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రానున్న నవరాత్రి ఉత్సవాల్లోనూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.