SIRపై మౌనపోరు.. డిమాండ్ ఇదే..!
01-10-2026 | 06:37pm
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో(Telangana Politics) మరో నిరసన కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. టీజేఎస్(TJS) కార్యాలయంలో శుక్రవారం ప్రొఫెసర్ కోదండరామ్ మౌనదీక్ష చేపట్టనున్నారు. ఎన్నికల సంఘం(Election Commission) విధానాలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా కోదండరామ్ ఈ మౌనదీక్షకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో SIR ప్రక్రియను నిలిపివేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. SIR ప్రక్రియపై తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కోదండరామ్ తెలిపారు.