సిగ్నల్ లేక..పండుటాకుల పరేషాన్
బెజ్జూర్ సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : బెజ్జూర్ మండలం(Bejjur Mandal)లో సరిగా సిగ్నల్(Signal) లేకపోవడంతో పండుటాకులు (వయోవృద్ధులు)(The elderly) తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. ఐ.ఎస్.పి లింక్(ISP Link) వైఫల్యం కారణంగా ఏర్పడిన నెట్వర్క్ అంతరాయం వల్ల, ప్రస్తుతం ఆధార్,ఈ కేవైసీ సేవలు అందుబాటులో లేక పెన్షన్ తీసుకునేందుకు బయోమెట్రిక్(Biometric) వేయాలంటే సిగ్నల్ కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు.
అసలు సమస్య ఏంటంటే:
ప్రతి నెలా పెన్షన్ పంపిణీ బీపీఎమ్(BPM Pension Distribution) లు అయితే చాలా గ్రామాల్లో నెట్ వర్క్ సిగ్నల్(Network signal) సరిగా లేకపోవడంతో థంబ్ ఇంప్రెషన్ పడటం లేదు. దీంతో ఉదయం నుండి సాయంత్రం వరకు వృద్ధులు వానకాలం వానలో, ఎండాకాలం ఎండలోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది.కొంతమంది వృద్ధులకు వేలిముద్రలు(Fingerprints) అరగిపోవడంతో ఇప్పటికే ఇబ్బంది పడుతుండగా, ఇప్పుడు సిగ్నల్ సమస్య మరింత ఇబ్బందిగా మారింది. నియోజకవర్గంలోని పలు మండలాలలో ప్రతిసారి సిగ్నల్ సమస్య తలెత్తుతుందని వృద్ధులు తెలుపుతున్నారు.
"రెండు రోజులుగా తిరుగుతున్నాం, సర్వర్ డౌన్(Server down), సిగ్నల్ లేదని చెబుతున్నారు. నడవలేక నడవలేక వస్తున్నాం, పెన్షన్ రాకపోతే ఎలా బతకాలి?" అని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఆఫ్ లైన్ విధానంలో పెన్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ సిగ్నల్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. పోస్ట్ ఆఫీస్ భవనాలు లేక అద్దె భవనాల్లో వసతులు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని వృద్ధులు తెలుపుతున్నారు. ఇట్టి విషయమై ప్రభుత్వాలు స్పందించి మండలంలో పోస్ట్ ఆఫీస్ భవనం మంజూరు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.