గొంతు నులిమి వృద్ధురాలి హత్య

20-09-2026 | 01:11pm

అశ్వాపురం, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): మండలంలోని తుర్రం వారిగూడెం(Turramvarigudem) గ్రామంలో జర్పుల సువాలి (60) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుర్తుతెలియని దుండగులు ఆమె గొంతు నులిమి హత్య చేసి, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఆభరణాల కోసమే హత్య జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులను విచారిస్తూ నిందితులను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది

మరిన్ని వార్తలు