రెడ్ క్రాస్ సొసైటీ నూతన కమిటీ ఎన్నిక

26-09-2026 | 01:43pm

మహబూబాబాద్, (విజయక్రాంతి): రెడ్ క్రాస్ సొసైటీ మహబూబాబాద్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక(Election of the new committee) ఏకగ్రీవంగా జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ అనిల్ కుమార్(Collector Anil Kumar) ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికైన 15 మంది సభ్యుల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్ గా మాధవ పెద్ద వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ గా డాక్టర్ బానోతు నెహ్రూ, ట్రెజరర్ గా గొర్రె వెంకన్న,  రాష్ట్ర రెడ్ క్రాస్ కమిటీ సభ్యునిగా రావుల రవిచంద్ర రెడ్డిని ఎన్నుకున్నారు. డైరెక్టర్లుగా పరకాల శ్రీనివాస్ రెడ్డి, విశ్వేశ్వరరావు, రేవూరి వెంకన్న, యాళ్ల మురళీధర్ రెడ్డి, డాక్టర్ పాల్వాయి సౌజన్య, డాక్టర్ సూర్య కుమారి, నవాబ్, కట్ల వెంకన్న, శ్రీనివాస్, కృష్ణ ప్రసాద్, రామసాయం వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ సూపర్డెంట్ రాజేష్ , ఏవో పవన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు

మరిన్ని వార్తలు