బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం చేయాలి

06-10-2026 | 12:58pm

ఇల్లెందు టౌన్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): సద్దుల బతుకమ్మ పండుగ (Bathukamma Festival) సందర్భంగా ఇల్లెందు పట్టణంలోని 24 వార్డుల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్ అధికారులు ముందస్తు ఏర్పాట్లు (Arrangements) చేయాలని 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య కోరారు.ప్రతి వార్డులో బతుకమ్మ ఆడే ప్రదేశాలను ముందుగానే గుర్తించి పరిశుభ్రత (Cleanliness), తాగునీరు, విద్యుత్ లైటింగ్ (Lighting), పారిశుద్ధ్యం, చెత్త తొలగింపు వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో బ్లీచింగ్ (Bleaching) చేయించాలని కోరారు.

మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనే ప్రాంతాల్లో భద్రతా చర్యలు (Security Measures) చేపట్టడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ (Traffic Control)కు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా మున్సిపల్, పోలీసు అధికారులు సమన్వయంతో (Coordination) పనిచేయాలని దండు సారయ్య విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు