అర్హులైన ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్

25-09-2026 | 04:42pm

వ్యవసాయ విస్తరణ అధికారి దివ్య. 

చేగుంట సెప్టెంబర్ 25, (విజయక్రాంతి) : అర్హులైన పతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్(Farmer Registration) చేయించుకోవాలని చందాయిపేట్ వ్యవసాయ విస్తరణ అధికారి దివ్య(Agricultural Extension Officer Divya) శుక్రవారం చేగుంట మండల పరిధిలోని పెద్ద శివనూర్ గ్రామంలో పర్యటించారు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కొత్తగా భూమి పట్టాదారు పాస్ పుస్తకాలు(Land Pattadar Passbooks) పొందిన రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ (ఫార్మర్ ఐడీ) చేయించుకోవాలని సూచించారు.

రైతుల సౌకర్యార్థం క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి గ్రామంలో  ప్రత్యేక ఫార్మర్ ఐడీ నమోదు కార్యక్రమం(Special Farmer ID Registration Program) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈనెల 30 వరకు చివరి తేది అని, రైతులు 

ఫార్మర్ ఐడీ నమోదు కోసం ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కు అనుసంధానమైన మొబైల్ నంబర్ తీసుకొని  రావాలని అన్నారు, ప్రభుత్వ వ్యవసాయ పథకాలు (ఎరువుల పంపిణీ, ధాన్యం కొనుగోలు, పంట రుణ పథకాలు), రైతులకు అందించే వివిధ సేవలను మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ఫార్మర్ ఐడీ నమోదు కీలకమని తెలిపారు.

మరిన్ని వార్తలు