సంఘం అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ భాద్యతగా పని చేయాలి

11-09-2026 | 07:56pm

కమ్మ సంఘం జిల్లా అధ్యక్షులు సూరపనేని నాగేశ్వరావు

ములుగు,(విజయక్రాంతి): కమ్మ సంఘం అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ భాద్యతగా పని చేయాలని శ్రీ గణపతి దేవ కాకతీయ కమ్మ సేవా సంఘం(Sri Ganapathi Deva Kakatiya Kamma Seva Sangam) ములుగు జిల్లా అధ్యక్షులు సూరపనేని నాగేశ్వరావు కమ్మ కుటుంబ సభ్యులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ములుగు జిల్లా(Mulugu District) వెంకటాపురంలో శ్రీ గణపతి దేవ కాకతీయ కమ్మ సేవా సంఘం ములుగు జిల్లా  త్రైమాసిక సమావేశం ఆత్మకూరి పట్టాభి రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా  సూరపనేని నాగేశ్వరావు మాట్లాడుతూ కమ్మ సంఘం మరింత పటిష్టం కోసం ప్రతీ ఒక్క కృషి చేయాలని అన్నారు.

అనంతరం జిల్లా శాశ్వత సభ్యత్వాలు, జిల్లా స్థాయిలో కార్తీక మాస వన భోజనాలు, 2027 సంవత్సర డైరీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో శ్రీ గణపతి దేవ కాకతీయ కమ్మ సేవా సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు సూరపనేని నాగేశ్వరావు, ఉపాధ్యక్షులు సూర్యదేవర కిషోర్ కుమార్, ఆచంట ప్రసాద్, జిల్లా ప్రచార కార్యదర్శి కొత్త గోపాల్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి అట్లూరి రఘురాం, జిల్లా కమిటీ సభ్యులు గూడవల్లి శ్రీహరి, నంబూరి రాజేందర్, మువ్వ భాను ప్రకాష్, జాగర్లమూడి నాగేశ్వరావు, ఆత్మకూరి పట్టాభి రామారావు, వెంకటాపురం మండల కమ్మ కుటుంబబీకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు