7 September, 2026 | 7:28 AM

కనీస వేతన బోర్డు నుంచి సీఐటీయూను మినహాయించడం దుర్మార్గం

07-09-2026 | 05:25am

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 6 :కేంద్ర కనీస వేతన సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణలో సీఐటీయూ , ఏఐటీయూసీ , ఐ ఎన్ టి యు సి లకు ప్రాతినిధ్యం నిరాకరించడాన్ని సీఐటీయూ జి ల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ అవుట రవీందర్ తీవ్రంగా ఖండించారు. మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల వైఖరికి నిదర్శనమన్నారు.ఆదివారం పట్టం లోని నెహ్రూగంజ్ హమాలీ కార్యాలయం (Nehrugunj Hamali Office) వద్ద నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2026 జూలై 21న పునర్వ్యవస్థీకరించిన బోర్డులో ప్రధాన కార్మిక సంఘాలను పక్కనపెట్టడం అప్రజాస్వామికమని, కక్షపూరితమని విమర్శించారు. తనకు అనుకూలమైన వారితో బోర్డు ఏర్పాటు చేసి కార్మికుల వేతనాలను అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు.

ధరలు పెరుగుతున్నా కార్మికుల ఆదాయాలు పడిపోతున్నాయని, కార్పొరేట్లకు మాత్రం రాయితీలు ఇస్తున్నారని అన్నారు. ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసుల మేరకు శాస్త్రీయంగా కనీస వేతనాలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు అద్దంకి నరసింహ, హమాలీ యూనియన్ నాయకులు ఆవురేశు, మార య్య, కాడింగ్ రవి, బోడ బక్కయ్య, అశోక్, నరసింహ, కృష్ణయ్య, శంకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు