7 September, 2026 | 7:28 AM

మూడేళ్లు ఫెయిల్.. రెండేళ్లలో ఏం చేస్తారు?

07-09-2026 | 05:25am
  1. హామీలిచ్చి మోసం చేయడమే..
  2. కాంగ్రెస్ హయాంలో విద్యావ్యవస్థ కుదేలు
  3. బీజేపీ వస్తే బడ్జెట్ పెంచుతాం, ఖాళీ పోస్టుల భర్తీ  
  4. దావోస్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
  5. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్  

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాం తి): మూడేళ్ల పాలనలో ఏ సమస్యనూ పరిష్కరించలేని కాంగ్రెస్ ప్రభుత్వం.. (Congress government) మిగిలిన రెండేళ్లలోనే ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుఎన్.రాంచందర్‌రావు (BJP State President N. Ramchandra Rao) విమర్శించారు. రేవంత్ సర్కార్ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.  బీజేపీ అధికారంలోకి వస్తే విద్యా రంగానికి బడ్జెట్‌ను పెంచడంతో పాటు అధ్యాపకులు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయుల ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని తెలిపారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీఆర్‌ఎస్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన ఓబీసీ, మున్నూరు కాపు సంఘం యువ నాయకులు పెద్ద సంఖ్యలో బీజేపీ పార్టీలో చేరారు. వారికి రాంచందర్ రావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వం, ప్రజా సంక్షేమ పాలనకు ఆకర్షితులై యువత పెద్దఎత్తున బీజేపీ వైపు వస్తుందన్నారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో ప్రభుత్వం విఫలమైనదని విమర్శించారు.

రిటైర్‌మెంట్ పొందిన ఉపాధ్యాయులు పెన్షన్ లేక, విధుల్లో ఉన్నవారు పదోన్నతులు లేక ఇబ్బందులు పడుతున్నారని రాంచందర్‌రావు పేర్కొన్నారు.  యూనివర్సిటీలు, పాఠశాలల్లో ఫాక్యల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీంతో బోధన కుంటుపడుతుందన్నా రు. దేశవ్యాప్తంగా విద్యా రంగానికి సగటున బడ్జెట్ కేటాయింపు 14.5 శాతం ఉంటే, తెల ంగాణలో కేవలం 9 శాతం మాత్రమే కేటాయించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో విద్యా రంగం దిగజారడానికి ముమ్మాటికీ సీఎం రే వంత్‌రెడ్డే బాధ్యత వహించాలన్నారు.

సీఎం విద్యాభ్యాసం చేసిన ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో  స్వయంగా వెళ్లి చూడాలన్నారు. ఇం టిగ్రేషన్ పేరుతో పాలిటెక్నిక్ విద్యను నాశనం చేయొద్దన్నారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయక పోవడంతో కళాశాలలు సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయన్నారు.

వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, దావోస్ పర్యటనల ద్వారా విప్లవం సృష్టించామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభు త్వం.. ఇప్పటివరకు ఎన్ని పరిశ్రమలు వచ్చా యి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో పూర్తి వివరాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

‘సర్’పై సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం

‘సర్’ ద్వారా టార్గెటెడ్ ఓట్లు తొలగించి  బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని రాంచందర్‌రావు పేర్కొన్నా రు. సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కేరళలో ఎన్నికలు జరిగాయని, అక్కడ కాంగ్రెస్ పార్టీనే గెలిచిందని, బీజేపీ విజయాలతో ‘సర్’ను ఎలా ముడిపెడతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, మరోవైపు బీజేపీ బలపడుతుండటంతో వచ్చే ఎ న్నికల్లో ఓటమి భయం పట్టుకుందని, అం దుకే సీఎం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీనే అధి కారాన్ని అడ్డంపెట్టుకొని బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను జాబితా నుంచి తొలగిం చే కుట్ర చేస్తుందని ఆరోపించారు.  ముఖ్యం గా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీకి మద్దతుదారులుగా ఉన్న లక్షలాది మంది ఓటర్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తుండటం తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ కీలక నాయకుల కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు జారీ చేస్తున్నారని.. సాంకేతిక కారణా లు, నిబంధనల సాకుతో ఓట్లను తొలగించే కుట్ర జరుగుతుందన్నారు. 

క్షేత్రస్థాయిలో సర్ ప్రక్రియలో పాల్గొంటున్న బీఎల్‌ఓలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని, అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఆధారాల తో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి న్యాయ పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.  రాష్ట్రంలో ఉద్యోగులు, విద్యార్థు లు, రైతులు, టీచర్లు, విద్యుత్ కార్మికులు.. ఇలా అన్ని వర్గాలు రోడ్లపైకి వచ్చి పోరాడే దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చ రించారు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం లభిస్తుందని రాంచంర్‌రావు భరోసా ఇచ్చారు.


మరిన్ని వార్తలు