అలాంటి ఫీలింగ్ రానివ్వడు!
సందీప్ యాక్షన్ -అడ్వెంచర్ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘సిగ్మా’. ఈ సినిమాతో జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫారియా అబ్దుల్లా హీరోయిన్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలంగాణ, కోస్తాంధ్రలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ విడుదల చేస్తుండగా, సీడెడ్ ప్రాంతంలో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తోంది. అక్టోబర్ 2న థియేటర్ల ద్వారా విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను కథానాయిక ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) విలేకరులతో పంచుకుంది.
*‘-సిగ్మా నా తొలి తమిళ్ సినిమా. లైకా లాంటి పెద్ద బ్యానర్లో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. -ఇందులో నా క్యారెక్టర్ రేడియో జాకీ. ఈ సినిమాలో నాకు అన్నిరకాల భావోద్వేగాలను చాలా బాగా ప్రదర్శించే అవకాశం దొరికింది. ప్రేక్షకులు ఫ్యామిలీతో కలిసి సినిమా చూడొచు.్చ.
* నేను ‘మత్తు వదలరా’ తర్వాత యాక్షన్ వైపు ఆసక్తి చూపిస్తున్నానన్న అభిప్రాయం ఈ మధ్య కొందరి నుంచి వ్యక్తమవుతోంది. ఒకవేళ అదే నిజం అనుకుంటే -యాక్షన్ నా పర్సనాలిటీకి కూడా నప్పుతుంది కదా. అయితే, నాకు అన్ని రకాల సినిమాలూ చేయాలనుంది. యాక్షన్‌నూ ఇష్టపడతా.
*సందీప్ కిషన్ నాకు చాలా కాలంగా తెలుసు. మేమిద్దరం కలిసి ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాం. చివరకు ‘సిగ్మా’తో కుదిరింది. ఇందులో మా క్యారెక్టర్స్‌లో చాలా కొత్తదనం వుంటుంది. జేసన్ జూమ్ కాల్‌లో కథ చెప్పారు. మొత్తం విన్న తర్వాత ఆయన ఏజ్ ఎంత అని అడిగితే, 24 ఏళ్లు అని చెప్పారు. నాకు చాలా స్ఫూర్తిమంతంగా అనిపించింది. తను సీఎం విజయ్ గారి అబ్బాయి. కాకపోతే అలాంటి ఫీలింగ్‌ను మనలో కలిగించరు. చాలా వినయంగా, స్నేహపూర్వకంగా కలిసిపోతారు. అతనికి డైరెక్షన్ మీద మంచి కమాండ్ ఉంది. తొలి సినిమా అయినప్పటికీ ఎంతో క్లారిటీ ఉన్న విజన్‌తో తీశారు. తను సెట్స్‌ను హ్యాండిల్ చేసిన విధానం చాలా కూల్‌గా ఉంటుంది.
*తమిళ్‌లో ఎక్కడికెళ్లినా సరే నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. సందీప్, జేసన్‌ను అభిమానించేవారు కూడా అక్కడ చాలా ఉంది. అదంతా నాకు కూడా కలిసొచ్చింది.
*నాకు ‘సిగ్మా 2’ కూడా చేయాలనుంది. ఈ సినిమాను ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తే ‘పార్ట్ 2’ చేసే అవకాశం కూడా ఉందని భావిస్తున్నా. కాకపోతే ఈ కథ ఇక్కడితో పూర్తవుతుంది.
*నాకు దర్శకత్వంపై ఆసక్తి ఉంది. కాకపోతే దానికి ఇంకా సమయం వుంది. కొన్ని కథలు రాస్తున్నా. నేను దర్శకత్వం చేస్తే సినిమాలో నేనే నటిస్తా. తమిళ ఇండస్ట్రీ, ఇక్కడి -పరిశ్రమ ఒకలాగే ఉంది. పెద్దగా తేడా ఏమీ లేదు. కాకపోతే ఆహారపు అలవాట్లు కొంచెం భిన్నంగా ఉన్నాయి. తమిళ్‌లో కొత్తగా -కొన్ని కథలు విన్నా. ‘సిగ్మా’ రిలీజ్ అయిన తర్వాత వాటి గురించి ఒక నిర్ణయం తీసుకుంటా.