రైతులు ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలి
22-09-2026 | 06:27pm
సెప్టెంబర్ 30లోపు నమోదు పూర్తి చేయాలి
గజ్వేల్, సెప్టెంబర్ 22: రైతుల సంక్షేమం కోసం తెలంగాణ వ్యవసాయ శాఖ(Telangana Agriculture Department) చేపట్టిన అగ్రిస్టాక్–రైతు రిజిస్ట్రేషన్ (ఫార్మర్ ఐడీ) కార్యక్రమం గజ్వేల్ రైతు వేదికలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీఏ బాబు నాయక్, ఏఈఓ సచిన్, రైతులు పాల్గొన్నారు. ఫార్మర్ ఐడీ ద్వారా ఎంఎస్పీ కొనుగోళ్లు, ఎరువులు, పంట రుణాలు, ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సేవలు పొందేందుకు ప్రయోజనం ఉంటుందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు ఏఈఓలు లేదా మీ సేవా కేంద్రాల్లో ఆధార్, పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌తో ఉచితంగా నమోదు చేసుకోవచ్చని సూచించారు.