24 గంటల విద్యుత్ కోసం రాస్తారోకో
11-09-2026 | 03:49pm
రాఘవాపూర్ రోడ్డుపై భారీ ఆందోళన.. ఎస్‌ఈకి వినతిపత్రం
సిద్దిపేట రూరల్, సెప్టెంబర్ 11: రైతులకు 24 గంటల విద్యుత్(24 hour electricity) సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట రూరల్ మండలం(Siddipet Rural Mandal) రాఘవాపూర్ రోడ్డుపై రైతులు భారీగా రాస్తారోకో(Farmers Rasta roko) నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు చేరుకున్న సిద్దిపేట విద్యుత్ శాఖ ఎస్‌ఈకి రైతుల తరఫున సుడా మాజీ చైర్మన్ మాడెడ్డి రవీందర్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.