బేకరిలో కుళ్లిన ఐస్ క్రీమ్స్ పై తనిఖీలు
బిజినేపల్లి, అక్టోబర్ 01 : మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి బెంగుళూర్ అయ్యంగార్ బేకరిలో కుళ్లిన ఐస్ క్రీమ్స్ మీద వినియోగదారుల నుండి పిర్యాదు రావడంతో ఆహార భద్రతా(Food safety officials) మరియు ప్రమాణాల నిబంధనల అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం బేకరిలో ఐస్ క్రీమ్స్ కొనుగోలు చేయడానికి వచ్చిన వినియోగదారులకు కుళ్లిన, పాడైన ఐస్ క్రీమ్స్ కనిపించాయి.
ఈ విషయమై వారు ఆహార భద్రతా అధికారి శ్రీలతకు ఫోన్ లో పిర్యాదు చేశారు. కాగా అధికారులు మరుసటి రోజు ఆరోపణలు ఎదుర్కొంటున్న బేకరిపై తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఐస్ క్రీమ్స్ పరిశీలించి, శనగపప్పు, మైదా పిండి నమూనాలు సేకరించారు. వీటిని పరీక్షించగా వచ్చిన నివేదికల తర్వాత కేసులు నమోదు చేస్తామని అధికారి తెలిపారు. ఈ బేకరిలో గత సంవత్సరం కుళ్లిన బ్రెడ్ ఉండటంతో పాటు ప్రస్తుతం ఐస్ క్రీమ్స్ కుళ్ళడం వంటి ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా ఆహార భద్రతా సిబ్బంది వాజిద్ స్థానిక వినియోగదారులు ఉన్నారు.