జాతీయ అటవీ అమరులకు నివాళి
11-09-2026 | 03:44pm
- నిర్మల్ సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): జాతీయ అటవీ అమరుల దినోత్సవం(National Forest Martyrs Day) సందర్భంగా గండి రామన్న అర్బన్ పార్క్ చించోలి వద్ద ఉన్న అటవీ అమరుల స్థూపం వద్ద నివాళులు ఆర్పించారు. అమరవీరులైన అటవీ శాఖ ఉద్యోగులకు ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. శాఖ మండలాధికారి నాగిని మాను వారి సేవలను కొనియాడారు. అటవీ శాఖలో విధులు నిర్వహిస్తూ అమరులైనటువంటి కుటుంబ సభ్యులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ అటవీ మండలాధికారి నిఘా విభాగం బాసర, రామకృష్ణారావు ఎఫ్ఆర్ఓ, జిల్లా అటవీ క్షేత్ర అధికారులు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.