బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే భరోసా

20-09-2026 | 04:17pm

పాపన్నపేట,సెప్టెంబర్20: పాపన్నపేట మండలంలోని తమ్మాయిపల్లి, మిన్‌పూర్ గ్రామాల్లో మృతి చెందిన వారి కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి(Former MLA Padmadevender Reddy) ఆదివారం పరామర్శించారు. తమ్మాయిపల్లి గ్రామ సర్పంచ్ సక్కురు నాయక్ భార్య రుక్కిబాయి శనివారం మృతి చెందారు. మిన్‌పూర్ గ్రామంలో కర్రోళ్ల హన్మయ్య మృతి చెందగా ఇట్టి విషయం తెలుసుకున్న పద్మాదేవేందర్‌రెడ్డి తమ్మాయిపల్లి, మిన్ పూర్ చేరుకుని మృతదేహాలకు నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరి వెంట తమ్మాయిపల్లి గ్రామ ఉప సర్పంచ్ అనిల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి, నార్సింగ్ సర్పంచ్ మల్లేశం, నాయకులు గోపాల్, కిరణ్, మాజీ సర్పంచ్ లు శ్రీనాథరావు, శ్రవంతి శ్రీనివాస్ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు