బాలికల విద్యాలయాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

01-10-2026 | 08:03pm

భూపాలపల్లి / రేగొండ, అక్టోబర్ 01 ( విజయ క్రాంతి ) : రేగొండ మండలం లింగాల క్రాస్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల విద్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Former MLA Gandra Venkataramana Reddy) సందర్శించారు. ఈ సందర్భంగా గండ్ర విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యాలయంలోని వసతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ తరగతి గదిలో ఫ్యాన్లు, లైట్లు సరియైన వెంటిలేషన్ అందుబాటులో లేకపోవడం, చిన్నపాటి మరమ్మతులు అవసరం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల్లో గత సంవత్సరం మంచి ర్యాంకులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు గండ్ర అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు