వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ నామ
(ఖమ్మం, విజయక్రాంతి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించి శుభఫలితాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ పండుగను అందరూ భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని, సంప్రదాయాలను పాటిస్తూనే మట్టి గణపతి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షిద్దామని పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్న స్వచ్ఛంద సంస్థలను నామ అభినందించారు. వినూత్నంగా కొందరు విత్తన గణపతి విగ్రహాలను ఉపయోగించడం ఆదర్శనీయమని పేర్కొన్నారు. పర్యావరణహితంగా పండుగను నిర్వహించడం ద్వారా భావితరాలకు మంచి సందేశాన్ని అందించాలని కోరారు. వినాయకుడి ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో సకల విజయాలు సాధించేందుకు గణనాయకుడి కృప లభించాలని నామ కోరుకున్నారు.