సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన మాజీ ఎంపిటిసి పాండు

25-09-2026 | 07:05pm

మునిపల్లి సెప్టెంబర్25 ( విజయ్ క్రాంతి): మండల పరిధిలోని పెద్దగోపులారం గ్రామానికి (Peddagopularam Village)చెందిన బేకరి అంజమ్మ కు మంజూరైన సీఎంఆర్ చెక్కును(CMR cheque) శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి  దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు పెద్ద గోపులారం మాజీ ఎంపీటీసీ పాండు  అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ నిరుపెద్దలకు ఒక వరం లాంటిదని, అందుకు సీఎంఆర్ కు అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు నరేందర్ చారి, వార్డు సభ్యులు మోహన్, గోపాల్, గ్రామస్తులు నాగేందర్, శివయ్య లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు