విఘ్నాలు తొలగించు వినాయకా

19-09-2026 | 11:03am

వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ సర్పంచ్ రజిత రమేష్

జగదేవపూర్, సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): జగదేవపూర్ మండలం తీగుల్ నర్సాపూర్(Teegul Narsapur) గ్రామంలోని కోరిన కోరికలు తీర్చే కొండపోచమ్మ ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి మాజీ సర్పంచ్ రజిత రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడిని దర్శించుకుని గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, గ్రామంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రజలందరికీ శుభం కలగాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు