ఉద్యోగాల పేరుతో మోసం

08-09-2026 | 04:30am

54 మంది నుంచి 8 కోట్లు వసూలు 

ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పీఏ అరెస్ట్

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి, మోసాలకు తెర!

భద్రాచలం, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): గత కొంత కాలంగా భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, ఇల్లందు, చర్ల, దుమ్ముగూడెం, వాజేడు, బూర్గంపాడు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కొర్ల కళ్యాణ్‌(Korla Kalyan)ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు భద్రాచలం డీఎస్పీ అరుణ్‌కుమార్(DSP Arun Kumar) తెలిపారు. బీటీపీఎస్ మణుగూరు, ఐటీసీ సారపాక కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 54 మంది నుంచి రూ.8 కోట్లు వసూలు చేసినట్టు తెలిసింది.

భద్రాచలంకు చెందిన రాయల శ్రీను ఫిర్యాదు మేరకు భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్‌లో పది రోజుల క్రితం కేసు నమోమదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న కొర్ల కళ్యాణ్‌ను ఆదివారం సాయంత్రం భద్రాచలంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కళ్యాణ్ గత కొంత కాలంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్నాడని తెలిసింది. అందుకోసమే తనకు తెలిసిన వారిని ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు కూడా బెట్ట్టింగ్‌లో పోగొట్టుకున్నాడని సమాచారం. నిందితుడిని భద్రా చలం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు