నేడు రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ పర్యటన
08-09-2026 | 09:37am
రాయ్‌బరేలీ: లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) నేడు తన పార్లమెంటరీ నియోజకవర్గమైన రాయ్‌బరేలీ(Raebareli)లో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశానికి అధ్యక్షత వహించి అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించనున్నారు.
ఇటీవల వరదలతో ప్రభావితమైన ప్రాంతాల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం శివ్‌గఢ్, మహారాజ్‌గంజ్ ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వరద నష్టాన్ని పరిశీలించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాహుల్ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.