తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
19-04-2025 | 08:59am
హైదరాబాద్: శుక్రవారం సెలవు దినం కావడంతో పెద్దఎత్తున భక్తులు తిరుమల కొండకు చేరుకున్నారు. శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) 24 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టు మెంట్లన్నీ నిండి టీబీసీ క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం నాడు 58,519 మంది భక్తులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. 30,360 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు.