గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
ఆర్యవైశ్య రాష్ట్ర పొలిటికల్ వైస్ చైర్మన్ తాటికొండ సీతయ్య
తుంగతుర్తి( విజయ క్రాంతి): ఖమ్మం జిల్లా(Khammam District) తిరుమలయపాలెం మండలం సుబ్లేడు గ్రామంలో స్వాతాంట్రోధ్యమా రధ సారధి మహాత్మా గాంధీ విగ్రహాన్ని(Statue of Mahatma Gandhi) ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఆర్యవైశ్య రాష్ట్ర రాజకీయ వైస్ చైర్మన్(State Political Vice-Chairman of Arya Vysya community) తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలో సమావేశంలో మాట్లాడుతూ.. దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని అన్నారు.
జాతీయ నాయకుల విగ్రహలను ఎక్కడ ధ్వంసం చేసిన వెంటనే పోలీసులు స్పందించి చెర్యలు చేపట్టాలని, అప్పుడే మరొకచోట చేయడానికి వెనకాడతారని అన్నారు, రాష్ట్ర కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు బ్రష్టు పట్టి పోయినాయని, శాంతి భద్రతలు కరువైయ్యినాయని అన్నారు. ధ్వంసం చేసిన దుండగులపై చెర్యలకు ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు ఈగ నాగన్న, కోశాధికారి మాసట్టి వెంకన్న. జిల్లా ఉపాధ్యక్షులు బండారు దయాకర్ ఓరుగంటి శ్రీనివాస్ తల్లాడ కేదారి ఈగ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు