ముమ్మరంగా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు

22-09-2026 | 06:39pm

జీళ్లచెరువు చెరువులో అన్ని విగ్రహాల నిమజ్జనాలకు ఏర్పాట్లు

పాలేరు జలాశయంలో వినాయక నిమజ్జనం నిషేధం 

కూసుమంచి, (విజయక్రాంతి): కూసుమంచి మండలం(Kusumanchi Mandal)లోని 41 జిపి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను జీళ్ళచెరువు గ్రామంలోని పెద్ద చెరువులో నిమజ్జనం చేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే నిమజ్జన కార్యక్రమం ఏర్పాటును అధికారులు పరిశీలించారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా గజ ఈత గాళ్లను ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. పాలేరు రిజర్వాయర్లో నిమజ్జనం ఏర్పాట్లు లేనందున ప్రతి ఒక్కరు జీళ్ళచెరువు నందు నిమజ్జనం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సైదులు, ఎంపీడీవో జస్వంత్ కుమార్, ఎస్సై నాగరాజు, ఇరిగేషన్ డి ఈ చిట్టిబాబు, సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు