14 July, 2026 | 8:17 PM

శివంపేట్ లో గంజాయి కలకలం

14-07-2026 08:16 PM

33 గ్రాముల స్వాధీనం!!

ఇద్దరు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు!!

శివంపేట్,(విజయక్రాంతి): నమ్మదగిన సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులు శివంపేట గ్యాస్ గోదాం దగ్గరలో గంజాయి సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి  తన సిబ్బందితో యుక్తంగా వెళ్లి వారిని పట్టుకుని విచారించగా వారి దగ్గర దాదాపు 33 గ్రాముల గంజాయి లభించడం జరిగింది వారు దానిని శివంపేట మండలంలోని కొంతమందికి అమ్మే ప్రయత్నం చేయడానికి తెచ్చారని దానిద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఆశతో ఈ విధంగా చేశామని చెప్పడం జరిగింది ఇట్టి గంజాయిని సీజ్ చేసి వారి మీద ఎన్డిపిఎస్   చట్టం ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారిద్దరి దగ్గర నుంచి రెండు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది.

అరెస్టు అయిన నిందితుల వివరాలు 

1). మార్తమన్ గణేష్ తండ్రి యాదగిరి వయస్సు 26, నివాసం శభాష్ పల్లి,

2). గౌర హమేత్ సింగ్ తండ్రి పురమ్ సింగ్  వయస్సు: 32 నివాసం తూప్రాన్ వీరిద్దరిని రిమాండ్ కు తరలించడం జరిగింది