వినాయక ఉత్సవాలకు సర్వం సిద్ధం

13-09-2026 | 05:34pm

ఉట్నూర్, సెప్టెంబర్ 13( విజయక్రాంతి ): భక్తిశ్రద్ధలతో  వినాయక ఉత్సవాలను జరుపుకున్నందుకు  ఏజెన్సీ ప్రజలు(People of the Agency areas) సర్వం సిద్ధం చేసుకున్నారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా వినాయకులను ప్రతిష్టించుటకు ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ  మండల కేంద్రాలతో పాటు  గ్రామాల్లో వినాయక మండపాల ఏర్పాట్లలో  యువకులు నిమగ్నమయ్యారు. ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో ప్రతి వీధికి వినాయకులను ప్రతిష్టించుటకు మండపాలను ఏర్పాటు చేశారు.

మండల కేంద్రాల్లోని  ఆయా వీధులలో  ఏర్పాటుచేసి అలంకరణ చేస్తున్నారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో వినాయక విగ్రహాలను  విక్రయించడంతో ఏజెన్సీ ప్రాంతంలోని  గ్రామాల ప్రజలు ఇంద్రవెల్లి చేరుకొని  వినాయక విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. వినాయక ఉత్సవాల సందర్భంగా శాంతియుతంగా నిర్వహించుకోవాలని  ఉట్నూర్ ఏఎస్పీ  రిత్విక్ సాయి కొట్టే, ఉట్నూర్ సీఐ  మాడవి ప్రసాద్ యువకులకు సూచనలు చేస్తున్నారు. వినాయక ఉత్సవాల సందర్భంగా డీజే లను నిషేధించారు. డీజే లను నడిపిస్తే  కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు