విజయక్రాంతి ఎఫెక్ట్: ముప్పనపల్లిలో చెత్త తొలగింపు
కన్నాయిగూడెం, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): కంపు కొడుతున్న ముప్పనపల్లి గ్రామం అనే శీర్షికతో ప్రత్యేక కథనం విజయక్రాంతి లో సెప్టెంబర్ 18న ప్రచురించడం జరిగింది. విజయక్రాంతి కథనంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండల అధికారులు, గ్రామపంచాయతీ సర్పంచ్(Gram Panchayat Sarpanch), పంచాయతీ కార్యదర్శి సిబ్బందితో కలిసి పారిశుధ్యంపై ప్రత్యేక కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ముప్పనపల్లి కూడలి నుంచి, గ్రామపంచాయతీ కార్యాలయం వరకు ఉన్న సైడ్ కాల్వలు పూర్తిగా శుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించారు.
ముప్పనపల్లి డ్రైనేజీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారం దిశగా పనిచేసిన విజయక్రాంతి(Vijayakranthi) పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తిప్పనపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ గ్రామస్తులు ఎవరు కూడా చెత్తను కాల్వల్లో వేస్తె కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారుల ఆదేశాలు పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. గ్రామంలోని వాణిజ్య సముదాయలు చెత్తను రహదారులపై వేయకుండా జాగ్రత్త నిల్వ చేసి చెత్త ట్రాక్టర్ వచ్చినప్పుడు ట్రాక్టర్ లో వేయాలన్నారు.