5 September, 2026 | 1:50 PM

రవీంద్రనగర్ లో దొంగతనం.. 3తులాల బంగారం చోరీ

05-09-2026 | 09:21am

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా (Mancherial District) బెల్లంపల్లి మండలం రవీంద్రనగర్ లో ఓ ఇంట్లో గుర్తుతెలియని దొంగలు చోరికి పాల్పడి మూడు తులాల బంగారాన్ని(Gold Stolen) ఎత్తుకెళ్లిన సంఘటన కలకలం రేపింది. తాళ్ళగిరిజాల రామకృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం.. రవీంద్రనగర్ కు చెందిన నీలి సాయి కృష్ణ కుటుంబ సభ్యులతో తన సొంత గ్రామం చాకపల్లి కి వెళ్లారు. ఈ సమయాన్ని అవకాశంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులకొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని బీరువా ను పగులకొట్టి అందులో ఉన్న 3తులాల బంగారాన్ని ఎత్తుకెళ్ళారు. సంఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్(Bellampalli ACP Kiran Kumar) సందర్శించారు. పోలీసు జాగిలం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు