ప్రజల ఆరోగ్య రక్షణకు సర్కార్ ప్రాధాన్యం
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
రాజీవ్ స్వగృహ బ్లాక్- ఏలో ఓపెన్ జిమ్ ప్రారంభం
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): నాగోల్ డివిజన్ పరిధిలోని రాజీవ్ స్వ గృహ బ్లాక్- ఏలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ పెన్ జిమ్‌ను ఆదివారం ఎల్బీనగర్ ఎమ్మె ల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Devireddy Sudheer Reddy), నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యా దవ్‌లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కాలనీ ల్లో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటు ద్వారా చిన్నారు లు, యువత, మహిళలు, వృద్ధులు ప్రతిరో జూ వ్యాయామం చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు.






