అభివృద్ధి పనులపై తీర్మానాలు
17-09-2026 | 05:53pm
బోథ్,(విజయక్రాంతి): జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి హామీ(Employment guarantee) పనిలో చేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీఓ జగ్గీరావు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ పంద్రం సుగుణ అధ్యక్షతన గ్రామసభ(Gram sabha) నిర్వహించారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం(Telangana prajapalana dinotsavam) పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఏర్పాటైన కార్యక్రమంలో ఏపీ ఓ మాట్లాడారు. వచ్చే సంవత్సరం చేపట్టనున్న అభివృద్ధి పనులపై తీర్మానాలు చేశారు.