సార్‌తో సర్పంచ్ సాబ్
జుక్కల్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): మద్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సార్ (ఎమ్మెల్యే) తో సర్పంచ్ సాబ్ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు(MLA Thota Lakshmikantha Rao) గ్రామ ప్రజలను స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్(District DCC President Yele Mallikarjun) పాల్గొన్నారు.
ప్రజలు తమకు ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దృష్టికి తీసుకురాగా, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, గ్రామ సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.