మెట్ పల్లిలో ఘనంగా వనమహోత్సవం

25-09-2026 | 04:28pm

​మెట్ పల్లి, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): వనమహోత్సవం కార్యక్రమంలో (Vanamahotsavam Program) భాగంగా శుక్రవారం మెట్ పల్లి పట్టణంలోని నేషనల్ హైవే డివైడర్లల మధ్యలో నాలుగు వందల మొక్కలు మరియు ఉర్దూ మీడియం హై స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం అత్యంత ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో  మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి,కమిషనర్ శ్రీనివాస్ గౌడ్,  వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, కౌన్సిలర్ లు  బొడ్ల ఆనంద్,బత్తుల నరేష్, అరిగెల అనూష, అరిగెల రాకేష్ , సిబ్బంది సురేష్, విష్ణు, ముజీబ్ లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు