ఘనంగా మహా అన్న ప్రసాద వితరణ

16-09-2026 | 07:39pm

గుండాల, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మండల కేంద్రంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాల(Ganesh Navaratri celebrations)లో భాగంగా సుభాష్ నగర్ లోని వినాయక మండపం వద్ద మూడవ రోజు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు, ప్రజలు, యువత, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ప్రసాదాన్ని భక్తి శ్రద్దలతో స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి గడ్డం రాంబాబు–సుజాత దంపతులు అన్నప్రసాదాన్ని అందించేందుకు సహకరించారు. వారి కుటుంబం అందించిన సహకారాన్ని సుభాష్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ఎస్ఐ శ్రవణ్ కుమార్, ప్రముఖ వ్యాపారస్తులు మానాల ప్రభాకర్, మానాల ప్రణీత్, తిరుక్కోవళ్ళూరి వెంకటేశ్వర్లు, పాత్రికేయులు, గ్రామస్థులు, భక్తులు, ప్రజలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు