ఘనంగా గంగా తెప్పోత్సవం
హుస్సేన్‌సాగర్ తీరంలో నిర్వహణ
పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రి పొన్నం తదితరులు
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద హుస్సేన్ సాగర్ తీరంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ గంగా తెప్పోత్సవం(Ganga Theppotsavam) ఘనంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలో గంగా హారతి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో సాగి ంది.
ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Assembly Speaker Gaddam Prasad Kumar), మంత్రి పొన్నం ప్ర భాకర్, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, తెలంగాణ మత్స్య సంస్థ చైర్మన్ మెట్టు సాయికు మార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకు లు మహేందర్ బాబు ఆధ్వర్యం లో వేడుకలు నిర్వహించారు. గంగా తెప్పోత్సవానికి మహిళలు, గంగపుత్రులు, మత్స్య కారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గం గపుత్రుల సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలను ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగా ణ మత్స్యకారులు, గంగపుత్రుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాల్సి న బాధ్యత అందరిపై ఉం దన్నారు. గంగపుత్రుల సంక్షేమం, మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. హుస్సేన్ సాగర్ తీరంలో జరిగిన గంగా తె ప్పోత్సవం తెలంగాణ సం స్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిందన్నారు. గంగా మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్ర జలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.






