7 September, 2026 | 8:32 AM

ఘనంగా దల్లాస్‌పురం ప్రారంభం

07-09-2026 | 05:30am

ఎల్బీనగర్‌లో అథెన్‌టిక్ తెలుగు కిచెన్ ఏర్పాటు

కార్యక్రమంలో హీరో ఆకాశ్ పూరి సందడి

ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): తెలుగు వారి అచ్చమైన రుచులు, పల్లెటూరి ఆతిథ్యం, సంప్రదాయ వాతావరణాన్ని నగరవాసులకు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘దల్లాస్‌పురం అథెన్‌టిక్ తెలుగు కిచెన్(Dallaspuram Authentic Telugu Kitchen)’ ఆదివారం ఎల్బీ నగర్‌లో ఘనంగా ప్రారంభమైంది. గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు ఆకాశ్ పూరి ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై దల్లాస్‌పురం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు చెందిన అచ్చమైన తెలుగు వంటకాలు, పల్లెటూరి రుచులు, ఇంటి భోజనాన్ని గుర్తు చేసే ప్రత్యేక వంటకాలను ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో దల్లాస్‌పురాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సంప్రదాయ వైర్ లైట్స్, దేశంలోనివివిధ ప్రాంతా ల నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన బాంబూ ల్యాంప్స్తో రూపొందించిన ప్రత్యేక వాతావరణం సందర్శకులను విశేషంగా ఆకట్టు కుంది. గ్రాండ్ లాంచ్ సందర్భంగా నిర్వహించిన ‘లక్కీ సిల్వర్ డ్రా’ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజేతలకు 1 కిలో వెండి బహుమతిగా అందించే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిం చింది. దల్లాస్‌పురం కో-ఫౌండర్ రాఘవేందర్ రెడ్డి కల్లెం మాట్లాడుతూ, తెలుగు వంటకాలకు ప్రత్యేకమైన బ్రాండ్ గుర్తింపు తీసుకురావాలన్నదే మా లక్ష్యం అన్నారు.

మరిన్ని వార్తలు