రెడ్డీస్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజలు

21-09-2026 | 03:45pm

మల్లాపూర్, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలో రెడ్డీస్ యూత్(Reddys Youth) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం వినాయక మండపం వద్ద మహిళలకు ప్రత్యేకంగా కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వినాయక మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి, గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్థానిక మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తుల్లో పెద్ద సంఖ్యలో హాజరై లక్ష్మీగణపతి నామస్మరణల మధ్య సమూహంగా కూర్చుని కుంకుమ పూజలు చేశారు. కుటుంబాలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వినాయకుడిని ప్రార్థించారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మహిళా భక్తులతో పాటు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు రెడ్డీస్ యూత్ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పూండ్ర శ్రీనివాస్ రెడ్డి, ఏలేటి రాజ రెడ్డి, పూండ్ర లక్ష్మా రెడ్డి, ఎల్లాల లక్ష్మా రెడ్డి, అల్లూరి రాకేష్ రెడ్డి, కొప్పెల మహేష్ రెడ్డి, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి (ఏ.వీ.ఆర్)తో పాటు రెడ్డీస్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు