కొల్లూరులో ఘనంగా వినాయకుడి శోభాయాత్ర

26-09-2026 | 01:52pm

రామచంద్రపురం ఆగస్టు 26:  రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు(Kollur)లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకుడి శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.గ్రామంలో పాతకాలం సంప్రదాయాలను కొనసాగిస్తూ భక్తులు ఒక్కొక్కటిగా వినాయక విగ్రహాలను తీసుకుని, ఒకదాని వెనుక మరొకటి వరుసగా శోభాయాత్రగా తరలించారు. డీజే(DJ) శబ్దాలకు దూరంగా తాళమేళాలు, భజనలు, పాటలతో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన శోభాయాత్రలో భక్తులు ఆనందోత్సవాలతో నృత్యాలు చేస్తూ, స్వామివారి భజనలో మునిగిపోయారు.

ఈ శోభయత్రలో మల్లేష్, ఎర్రోళ్ల విట్టల్, డిస్కో మల్లేష్, సుభాన్ రెడ్డి, ఎర్రోళ్ల మధు, వెంకటేష్ యాదవ్, సుభాష్ యాదవ్, ప్రకాష్ గౌడ్, బజన మండలి సభ్యులు గ్రామ పెద్దలు పెద్దసంఖ్యలో పాల్గోని నిమర్జనానికి తరలి వెళ్లారు.ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్ మాట్లాడుతూ.. కొల్లూరు గ్రామంలో వినాయక చవితి వేడుకలను ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. పాతకాలం నాటి సంప్రదాయాలను కొనసాగిస్తూ శోభాయాత్రను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. యువత కూడా సంప్రదాయాలను కాపాడుతూ భక్తి, ఆధ్యాత్మికతతో వేడుకల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.


మరిన్ని వార్తలు