ప్రైవేటు స్కూళ్లపై నియంత్రణ ఏదీ?
- అమలు కానీ మార్గదర్శకాలు
- కనిపించని పారదర్శకత
- ఫీజుల వసూళ్ల వివరాలెక్కడ
- వార్షిక ఆర్థిక నివేదికలు గాలికి
- ఆడిటింగ్ అంశాలు దాచేస్తున్నారు..
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో ప్రైవేటు పాఠశాలల నిర్వహణకు విద్యాశాఖ అనేక మార్గదర్శకాలు రూపొందించింది. పాఠశాలల పారదర్శకత ప్రధాన ఉద్దేశంగా రూల్ 11 ఆఫ్ జీవో ఎంఎస్ నెంబర్ 1, జీవో ఎంఎస్ నెంబర్ 46, 1994 జనవరి 1 తేదీ ద్వారా చట్టబద్ధమైన నియమ నిబంధనలను రూపొందించారు. ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District)లో వాటి అమలును స్థానిక అధికారులు గాలికి వదిలేశారని చెప్పక తప్పదు.
ఫలితంగా జిల్లాలో అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్వహణ అనేక అనుమానాలకు తావిస్తోందనీ విమర్శలు అధికమవుతున్నాయి. వాస్తవానికి ప్రతి పేట కనీసం జులై నాటికైనా ఆయా పాఠశాలల ఆర్థిక లావాదేవీల వివరాలను సంబంధిత మండల విద్యాశాఖ ద్వారా జిల్లా విద్యాశాఖకు సమర్పించాల్సి ఉంది. కొన్ని పాఠశాలలు మాత్రమే నివేదికలను సమర్పిస్తున్నాయని, ఎక్కువ శాతం పాఠశాలలు వార్షిక నివేదికను సమర్పించటం లేదని తెలుస్తోంది.
ప్రభుత్వం జారీ చేసిన జై బోలో ప్రకారం పాఠశాలల్లో చేరే విద్యార్థిని విద్యార్థుల నుంచి పాఠశాల యాజమాన్యం ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు, వాటిల్లో ట్యూషన్ ఫీజు ఎంత ఇతర ఫీజులు ఎంత అనే వివరాలను అందరికీ కనిపించేలా డిస్ప్లే చేయాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా ఏ ప్రైవేటు పాఠశాలల్లోనూ ఫీజుల వివరాలను బహిర్గతం చేసిన దాఖలాలు లేవు. దీంతోపాటు యాజమాన్యాల ఆదాయ వ్యయాల నివేదికలు ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలోనే జిల్లా విద్యాశాఖకు అందజేయాల్సి ఉంది.
ఎక్కువ శాతం ప్రైవేట్ పాఠశాలలు వార్షిక నివేదికను సకాలంలో సమర్పించడం లేదని అధికారులు వాపోతున్నారు. వార్షిక నివేదిక సమర్పించని పాఠశాలలపై అధికారులు ఉదాహసేనత వైఖరి అవలంబించడంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రోల్ 11 ఆఫ్ ది స్టేట్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ అన్యువల్ అడ్మినిస్ట్రేటివ్ రిపోరట్స్ (ఎ ఎ ఆర్ ఎస్) , అకౌంట్ సర్టిఫికెట్లతో పాటు సమర్పించకపోతే ఆ పాఠశాల గుర్తింపును తక్షణం రద్దు చేయాలనే నిబంధనలున్నాయి.
జిల్లాలో ఈ అంశంపై అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫలితంగా ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా పాఠశాలలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా అత్యధిక ఫీజులు ఏమైనా వస్తువులు చేసి నిజాలు దాచేస్తున్నారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
క్రీడా మైదానం జాడ ఎక్కడ?
పాఠశాల అనుమతుల సమయంలో తప్పనిసరిగా ప్రవేట్ పాఠశాల యాజమాన్యం క్రీడా మైదానాన్ని చెప్పాల్సి ఉంటుంది. అందుకుగాను కొన్ని పాఠశాలలు సమీపంలోని కాళీ ప్రదేశాన్ని క్రీడా మైదానంగా అధికారులకు చూపి అనుమతులను పొందుతుంటారు. అనుమతులు పొందిన తరువాత విద్యార్థులను రోడ్ల పైన, ఇండ్ల స్థలాల బేస్ మట్టం ప్రాంతాల్లో ఆటలాడించడం క్షేత్రస్థాయిలో దర్శనమిస్తున్నాయి. పాల్వంచ పట్టణ పరిధిలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులను పాఠశాల సమీపంలోని ఇండ్ల స్థలాల బేస్ మట్టంలో ఆటలాడించటం అందుకు తార్కాణం.
ఈ క్రమంలో విద్యార్థులు అదుపుతప్పి బేస్మట్టంపై పడినట్లయితే పరిస్థితి ఏమిటని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అడిగినంత ఫీజు చెల్లించిన విద్యార్థులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఈ పరిస్థితి ఉంటే మండల స్థాయిలో కొనసాగుతున్న ప్రైవేటు పాఠశాలల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు.
పూర్తి స్థాయి అనుమతులు లేకుండానే పాఠశాలల నిర్వహణ
ప్రవేట్ పాఠశాలలు నిర్వహించాలంటే విద్యాశాఖ నుంచి పూర్తిస్థాయి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ప్రధానంగా సమీప ప్రభుత్వ పాఠశాలల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, క్రీడా మైదానము, శానిటేషన్, ఫైర్ అనుమతులు, మున్సిపాలిటీ నుంచి కాలుష్య నియంత్రణ దృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. మండల విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం జిల్లా శాఖకు అనుమతుల కోసం సిఫారసు చేస్తారు.
ప్రాథమిక స్థాయి పాఠశాలకు జిల్లా విద్యాశాఖ, ఉన్నత పాఠశాలకు రీజినల్ డైరెక్టర్ విద్యాశాఖ అనుమతులను జారీ చేయాల్సి ఉంటుంది. కొన్ని పాఠశాలలు యాజమాన్యాల మార్పు అనధికారికంగా చేసుకొని పాఠశాలలను నిర్వహిస్తుంటారు.
ఒక ప్రదేశంలో ఉన్న పాఠశాలను, వేరే ప్రాంతం కి తరలించాలంటే తప్పనిసరిగా షిఫ్టింగ్ పర్మిషన్ పొందాల్సి ఉంటుంది. షిఫ్టింగ్ పర్మిషన్ తో పాటు , ఓపెనింగ్ పర్మిషన్స్ సైతం పొందాల్సి ఉంది. ఎలాంటి నిబంధనను జిల్లాలో ఎక్కువ శాతం పాఠశాలలు ఆమాలు చేయడం లేదు. వాటిని పర్యవేక్షించాల్సిన మండల, జిల్లా అధికారులు యాజమాన్యాల నుంచి ఆమ్యామ్యా లను దండుకొంటూ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఏళ్ల తరబడి షిఫ్టింగ్ పర్మిషన్ లేని పాఠశాలలు కోకోలలు ఉన్నట్లు సమాచారం.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం..
క్రీడా మైదానం అమలు చేయని పాఠశాలలపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తెలిపారు. పాఠశాలల షిఫ్టింగ్ పర్మిషన్ పై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటాం. ప్రతి పాఠశాలలో ఫీజులు వసూలు చేసే వివరాలను తప్పనిసరిగా డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయని పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం.
జిల్లా విద్యాశాఖ అధికారి, వాసంతి
