రాష్ట్రంలో ‘చోటా హిట్లర్’ పాలన
ఎంపీ డీకే అరుణ
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణలో చోటా హిట్లర్ పాలన నడుస్తున్నదని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేస్తూ, నిరంకుశ, నిర్బంధ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకా యిల వల్ల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియజేయాలని శాంతియుతంగా నిరసన తెలు పుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావును అరెస్టు చేయడం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుం దన్నారు. విద్యార్థుల పక్షా న పోరాడుతున్న బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం వెనుక ప్రభుత్వ భయం స్పష్టంగా కనిపిస్తున్నదని తెలిపారు. అరెస్టులకు బీ జేపీ భయపడబోదన్నా రు. ఫీజు రీయింబ ర్స్మెం ట్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని డీకే అరుణ హెచ్చరించారు.