బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టు అప్రజాస్వామికం
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), సెప్టెంబర్ 07: వర్షాకాల సమావేశాల సందర్భంగా అసెంబ్లీ(Assembly)లోకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను పోలీసులతో అడ్డుకుని,అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ జెడ్పీటీసీ, బీఆర్ఎస్(BRS) జిల్లా నాయకులు దావుల వీరప్రసాద్ యాదవ్ అన్నారు.ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని నిరసిస్తూ సోమవారం మండల కేంద్రం అర్వపల్లిలోని సూర్యాపేట-జనగామ 365(బీ)జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు,జెండాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 420 హామీలను,13 డిక్లేషన్లు,6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ అర్వపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణిలో ఎంపీడీఓ ఝాన్సీ,తహసీల్దార్ శ్రీకాంత్ లకు వినతి పత్రం అందజేశారు.ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వల్లపు గంగయ్య,వివిధ గ్రామాల బీఆర్ఎస్ సర్పంచులు కర్నాటి వెంకన్న,నున్న యాదగిరి,కలకోట్ల శైలేందర్,బొడ్డు ఇందిరాసోమరాజు,వీరాంజనేయులు,వీరస్వామి,సైదులు,నాయకులు యుగేందర్,రామలింగయ్య,రామకోటి,పొట్టెపాక సైదులు,ఎల్లంరాజు,రవీందర్,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.