19 August, 2026 | 10:50 AM

మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్

19-08-2026 10:16 AM

హైదరాబాద్: మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్(Harish Rao House arrest) చేశారు. కోకాపేటలోని హరీశ్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు హరీశ్ రావు పిలుపునిచ్చారు. సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav), సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు ముందస్తుగా నిర్భంధించారు.

హౌస్ అరెస్ట్ విషయం తెలిసుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. నిర్భందాలు, హౌస్ అరెస్టులను హరీశ్ రావు(Harish Rao) తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రుల్లో డొల్లతనం, ప్రభుత్వ వైఫల్యాలు బయట పడతాయనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అరెస్టులకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమన్న మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీతో, పోలీసుల నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.