గజల్ శ్రీనివాస్‌కు అత్యున్నత పురస్కారం

25-09-2026 | 05:00am

మారిషస్ గడ్డపై విశ్వ సంగీత శాంతి దూత అవార్డు ప్రదానం

హైదరాబాద్ (విజయక్రాంతి): మారిషస్‌లోని పోర్ట్ లూయిస్ వద్ద 108 అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి అతి పెద్ద విగ్రహం కలిగిన హరి హర దేవస్థాన ప్రాంగణంలో ప్రపంచ ప్రఖ్యాత గజల్ గాయకుడు, ట్రిపుల్ గిన్నీస్ ప్రపంచ రికార్డుల గ్రహీత డాక్టర్ గజల్ శ్రీనివాస్‌(Dr. Ghazal Srinivas)ను ‘విశ్వ సం గీత శాంతి దూత’ పురస్కారంతో మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్(Mauritius President Dharam Beer Gokhool) సత్కరించారు.

గజల్ శ్రీనివాస్ వివిధ ప్రపంచ భా షలలో గానం చేసి సనాతన ధర్మం, అ హిం సా, సత్యాగ్రహ సిద్ధాంతాలను ప్రచారం చేయడం ఎంతో స్పూర్తి దాయకమని, హరి హర దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారానికి గజల్ శ్రీనివాస్ ఎంపిక చే యడం  గొప్ప నిర్ణయమని ధరమ్ బీర్ గో కుల్ కొనియాడారు. మారిషస్‌లో డా.గజల్ శ్రీనివాస్ ప్రపంచ శాంతి, భారతీయ  సం స్కృతిలపై నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎంతో స్పూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు